బాయ్ ఫ్రెండ్ ని చంపిన ప్రముఖ హీరోయిన్ సోదరి
on Dec 3, 2024
బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్(ranbir kapoor)హీరోగా 2011 లో వచ్చిన 'రాక్ స్టార్ 'మూవీతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన అమెరికన్ నటి నర్గిస్ ఫక్రి.ఆ తర్వాత మద్రాస్ కేఫ్ లో కూడా హీరోయిన్ గా చేసిన నర్గిస్,ఆ తర్వాత కథకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించింది.కిక్, స్పై, హౌస్ ఫుల్ 3 వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ హరి హర వీరమల్లు తో పాటు హౌస్ ఫుల్ 5 లో కూడా చేస్తుంది.
రీసెంట్ గా నర్గిస్ ఫక్రి(nargis fakhri)సోదరి అలియా ఫక్రి తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఎడ్వర్డ్ జాకబ్ ని అతని స్నేహితురాలిని చంపిన కేసులో అరెస్ట్ కావడం జరిగింది.న్యూయార్క్ లో ఉంటున్న అలియా కొంత కాలం పాటు ఎడ్వర్డ్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అనస్టాసియా ఎటిని అనే యువతితో జాకబ్ కి పరిచయం అయ్యింది.దీంతో అది నచ్చని నర్గిస్, ఎడ్వర్డ్ ని పలుమార్లు బెదిరించింది.
ఈ క్రమంలోనే నవంబర్ 2 న ఎడ్వర్డ్, ఎటిని లు ఉన్న ఇంటి దగ్గరకి వెళ్లి బయట గడిపెట్టి నిప్పంటించింది.అది గమనించిన స్థానికులు మంటల్ని ఆపే ప్రయత్నం చేసినా గాని అప్పటికే ఆ మంటల్లో చిక్కుకొని ఇద్దరు చనిపోయారు.ఎంక్వయిరీ చేసిన పోలీసులు అలియాని అరెస్ట్ చేసారు.ఈ కేసులో ఆమె దోషి అని తేలితే జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి .తదుపరి విచారణని డిసెంబర్ 9 కి కోర్టు వాయిదా వేయగా ఈ విషయం మీద నర్గిస్ ఇంకా స్పందించలేదు.
Also Read